dangerous snake: పాముకాటుతో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

dangerous snake: పాముకాటుతో యువకుడి మృతి

May 31 2023 12:06 PM | Updated on May 31 2023 12:43 PM

- - Sakshi

సరుబుజ్జిలి: మండలంలోని బురిడివలస కాలనీకి చెందిన కొల్ల దుర్గారావు(25) సోమవారం అర్థరాత్రి నాగు పాముకాటుకు గురై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. దుర్గారావు సవళాపురం జంక్షన్‌ బ్రిడ్జి వద్ద చల్లగాలికి కూర్చొని, నిద్రించేందుకు తన ఇంటికి వెళుతుండగా చీకట్లో నాగు పాముకాటు వేసింది. వైద్యుల వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు. దుర్గారావుకు తండ్రి కొల్ల సింహాచలం, వీరమ్మ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement