శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఉల్లి ధరలు అమాంతంగా పెరగడంతో కిలో రూ.35కే రైతు బజార్లలో విక్రయిస్తామని సర్కారు అట్టహాసంగా ప్రకటించింది. కానీ ప్రతి బస్తాలో 10 కిలోలకు పైగా కుళ్లిపోయినవి వస్తుంటే, మరికొన్ని బస్తాలయితే మొత్తంగా కుళ్లిపోయి వస్తున్నాయి. దీ నిపై వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ప్ర భుత్వం తక్కువ ధరలకు సరఫరా చేయడం కంటే కృత్రిమంగా ఉల్లి డిమాండ్‌ను సృష్టిస్తున్న వారిని నియంత్రించేందుకు చర్యలు చేపడితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. రెండు కిలోలు కొంటే కిలో ఉల్లిపాయలు కుళ్లినవే ఇస్తున్నారని చెబుతున్నారు.


