శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలి పారు. విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, తుఫాన్ ప్రభావం వల్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సహా అన్ని యాజమా న్యాల పరిధిలోని పాఠశాల లు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ సెలవు వల్ల విద్యార్థుల విద్యాక్యాలెండర్‌కు ఆటంకం కలగకుండా, నష్టపోయే పనిదినాన్ని భర్తీ చేయడానికి తగిన ప్రత్యామ్నాయ పనిదినాన్ని కేటాయిస్తూ త్వరలోనే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని కలెక్టర్ వివరించారు.


