బెదిరింపులు.. విజిలెన్స్‌ దాడులు | - | Sakshi
Sakshi News home page

బెదిరింపులు.. విజిలెన్స్‌ దాడులు

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

● వైఎస్సార్‌సీపీ నామినేషన్ల ఉపసంహరణకు అధికార పార్టీ అడ్డదారులు

● టెక్కలిలో శ్రుతి మించుతున్న వ్యవహారాలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు టీడీపీ అన్ని అడ్డదారులు తొ క్కుతోంది. టెక్కలి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, వారికి తోడుగా ఉన్న కార్యకర్తలను ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మరీ హెచ్చరిస్తున్నారు. మరి కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు చెందిన చిన్నపాటి వ్యాపారాలపై హడావుడిగా విజిలెన్స్‌ దాడులు చేస్తున్నారు. టీడీపీకి చెందిన అభ్యర్థులను ఏకగ్రీవం చేయడానికి ఏకంగా పోలీసులే కార్యకర్తలుగా వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా టెక్కలి మండలంలో అధికార పార్టీ నుంచి ఎంపీపీ స్థానాన్ని ఆశిస్తున్న అభ్యర్థి నామినేషన్‌ వేసిన ప్రాదేశికాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తక్షణమే నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్‌స్టేషన్‌లో పడిగాపులు కాయిస్తున్నారు. నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే ఇబ్బందులు పడతారంటూ పోలీసులే హెచ్చరించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కోటబొమ్మాళి మండలం తాటిపర్తి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటిలో విజిలెన్స్‌ దాడులు చేసి అధికంగా జీడి బస్తాలు ఉన్నాయంటూ అక్రమ కేసులు నమోదు చేశారు. నందిగాం మండలం కాపు తెంబూరు గ్రామంలో ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. చిన్నపాటి రైస్‌ మిల్లు పై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌ రావాల్సిందేనంటూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు సైతం హుకుం జారీ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కొంత మంది పోలీస్‌ అధికారు లే కార్యకర్తల అవతారం ఎత్తుతున్నారంటూ స్థాని కంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం కొంత మంది పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా అప్రజాస్వామికంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement