కంచిలి: మండలంలోని జె.భైరిపురం ప్రాదేశికం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ధనుంజయ ప్రధాన్ అభ్యర్థిత్వం ఆర్డీఓ వద్ద కూడా తిరస్కరణకు గురైందని స్థానిక రిటర్నింగ్ అధికారి కె. అప్పలస్వామి తెలిపారు. డోలగోవిందపురం గ్రా మంలో రేషన్ డీలర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ధనుంజయ ప్రధాన్‌పైన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6ఎ కేసు నమోదవడం, ఆ కేసు నడుస్తున్న విషయమై టీడీపీ సభ్యుడు పూర్ణచంద్ర బిసాయి అభ్యంతరం తెలపడంతో రిటర్నింగ్ అధికారి ధనుంజయ ప్రధాన్ నామినేషన్‌ను రిజెక్ట్ చేశారు. తర్వాత ధనుంజయ ప్రధాన్ ఆర్డీఓకు అప్పీల్ చేశారు. తాజాగా ధనుంజయ ప్రధాన్ నామినేషన్‌ను ఆర్డీఓ కూడా తిరస్కరించారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘన
టెక్కలి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పటిష్టంగా ఎన్నికల కోడ్‌ను అమలు చేస్తున్నామంటూ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. అయితే డివిజన్ కేంద్రమైన టెక్కలిలో సాక్షాత్ సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘన చోటు చేసుకుంది. అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు కేటాయించిన మైదానం వద్ద, టెక్కలి మండలం గంగాధరపేట, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా అధికార పార్టీకి చెందిన శిలా ఫలకాలు, పోస్టర్లు కనిపిస్తున్నాయి. దీంతో ఎన్ని కల కోడ్‌ను పర్యవేక్షించాల్సిన అధికారి కార్యాలయంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘన చోటు చేసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది.
ఆర్‌ఓ రాక అభ్యర్థుల నిరీక్షణ
జలుమూరు: స్థానిక ఎన్నికల్లో భాగంగా సో మవారం ఎంపీటీసీ అభ్యర్థులు విత్‌డ్రాలకు సంబంధిత ఆర్‌ఓ జయంతి ప్రసాద్ సమయానికి రాకపోవడంతో మండల పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులు గంటలు తరబడి నిరీ క్షించారు. ఉదయం పది గంటలకు విత్‌డ్రాలు కోసం పిలిచిన అధికారులు సుమారు 12 గంటలు వరకూ ఆర్వో రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.


