నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. హంద్రీ –నీవా కాలువలో కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. ఇటీవల కొత్తగా మూడు బోర్లు వేయించినా నీరు పడలేదు. రూ. 1.2 లక్షల వరకు ఖర్చయింది. సాగు చేసిన బ్యాడిగ మిర్చి, మొక్కజొన్న పంటలకు పక్క రైతు బోరు నుంచి నీరు పెట్టుకొని నూర్పిడి చేసుకున్నా. పంటలకు నీరు సరిగా అందక దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. ఇకపై భూమి బీడు పెట్టాల్సిందే.
– పవన్ కుమార్, రైతు, ముద్దలాపురం


