11 మండలాల్లో వర్షం | - | Sakshi
Sakshi News home page

11 మండలాల్లో వర్షం

Jul 18 2026 9:51 AM | Updated on Jul 18 2026 9:51 AM

పుట్టపర్తి అర్బన్‌: వాతావరణంలో మార్పులు చోటుచేసుకోగా జిల్లాలోని 11 మండలాల్లో వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ 11 మండలాల పరిధిలో మొత్తం 165.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నల్లమాడ మండలంలో 68.2 మి.మీ, బుక్కపట్నం 30.4, సోమందేపల్లి 18.4, కదిరి 13, తాడిమర్రి 10.2, నల్లచెరువు 8.4, పుట్టపర్తి 5.2, గాండ్లపెంట 4.8, ఓడీచెరువు 4.4, అమడగూరు 1.4, ధర్మవరంలో 1 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాకు మరో రెండు రోజులు వర్ష సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

20న షైనింగ్‌ స్టార్లకు సత్కారం

పుట్టపర్తి: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ‘షైనింగ్‌ స్టార్స్‌–2026’ పేరుతో సత్కరించనున్నట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20వ తేదీ ఉదయం 8 గంటలకు పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మాహి శ్రీనివాస గార్డెన్స్‌లో సత్కార కార్యక్రమం ఉంటుందన్నారు. పురస్కారానికి ఎంపికై న ప్రతి విద్యార్థికి రూ.20 వేల నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం, మెడల్‌ అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులంతా తల్లిదండ్రుల వెంట తీసుకుని సకాలంలో కార్యక్రమానికి రావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement