‘నీట్‌’గా రాణించారు | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’గా రాణించారు

Jul 18 2026 9:51 AM | Updated on Jul 18 2026 9:51 AM

నల్లచెరువు/పెనుకొండ/ఓడీచెరువు: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన ‘నీట్‌’ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. శుక్రవారం ర్యాంకులు ప్రకటించగా...రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ జిల్లా విద్యార్థులు మెరుగైన ర్యాంకులు దక్కించుకున్నారు.

శ్వేతరాయల్‌కు 1,750 ర్యాంకు

నల్లచెరువు మండలం కళ్లిపల్లికి చెందిన కమ్మల బాలాజీ, మీనాక్షి దంపతుల కుమార్తె కమ్మల శ్వేత రాయల్‌ ‘నీట్‌’లో ఆల్‌ ఇండియాలో జనరల్‌ కేటగిరీలో 1,750 ర్యాంక్‌ సాధించింది. దీంతో కుటుంబీకులు, బంధువులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. పలువురు గ్రామస్తులు రాజకీయ నాయకులు శ్వేతను అభినందించారు.

పెనుకొండ విద్యార్థికి 2,105 ర్యాంకు

పెనుకొండకు చెందిన కాడిశెట్టి శ్రీనివాసులు, ఆనందమ్మ దంపతుల కుమారుడు కాడిశెట్టి పవన్‌్‌ కుమార్‌్‌ ‘నీట్‌’లో ఆల్‌ ఇండియా జనరల్‌ కేటగిరీలో 2,105 ర్యాంక్‌ సాధించాడు. దీంతో స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు పవన్‌కుమార్‌ను అభినందనలతో ముంచెత్తారు.

మెరసిన ఓడీసీ విద్యార్థి..

ఓడీచెరువుకు చెందిన కమ్మల బాలాజీ, మీనాక్షి దంపతుల కుమార్తె శ్వేత ‘నీట్‌’లో ఆల్‌ ఇండియా జనరల్‌ కేటగిరీలో 3,598 ర్యాంకు దక్కించుకుంది. ఇంటర్మీడియట్‌ పరీక్షలో సైతం 980 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. దీంతో శ్వేతను ఆమె తల్లిదండ్రులు అభినందించారు.

దిలీప్‌... సూపర్‌

సోమందేపల్లి మండలం కదిరేపల్లికి చెందిన కురుబ దిలీప్‌ ‘నీట్‌’లో ఆల్‌ ఇండియా జనరల్‌ కేటగిరీలో 29,925 ర్యాంకు దక్కించుకున్నాడు. దిలీప్‌ తండ్రి కురుబ రామాంజనేయులు చిల్లర అంగడితో పాటు వ్యవసాయం చేస్తుండగా.. తల్లి శోభారాణి అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. తల్లిదండ్రులు కష్టాన్ని చూసిన దిలీప్‌.. కష్టపడి చదివి నీట్‌లో మెరుగైన ర్యాంక్‌ సాధించాడు. దీంతో దిలీప్‌ను తల్లిదండ్రులతో పాటు స్థానికులు అభినందించారు. గ్రామంలో స్వీట్లు పంచుకున్నారు.

జాతీయస్థాయి పరీక్షలో

సత్తా చాటిన జిల్లా విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement