కార్యకర్తకు రక్ష ‘జగన్‌ 2.0’యాప్‌ | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తకు రక్ష ‘జగన్‌ 2.0’యాప్‌

Jul 18 2026 9:45 AM | Updated on Jul 18 2026 9:45 AM

ఓడీచెరువు: వైఎస్సార్‌ సీపీ తీసుకువచ్చిన ‘జగన్‌ 2.0’ సూపర్‌ యాప్‌ కార్యకర్తలకు రక్షణ కల్పిస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఓడీచెరువు మండల పరిధిలోని ఎంబీ క్రాస్‌లో జెడ్పీటీసీ దామోదర్‌రెడ్డి రైస్‌ మిల్‌లో ‘జగన్‌ 2.0’ సూపర్‌ యాప్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు బంగారు భవిష్యత్తుకు జగనన్న బాటలు వేస్తున్నాడని, అందులో భాగంగానే కార్యకర్తల కష్టాలు తెలుసుకుని తోడుగా నిలిచేందుకు ‘జగన్‌ 2.0’ యాప్‌ అందుబాటులోకి తెచ్చారన్నారు. కార్యకర్తలంతా ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని జగనన్న డిజిటల్‌ ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు అన్యాయం చేసిన వారి భరతం పడతామన్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలు, నేతల ప్రెస్‌మీట్లు యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement