స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతా స్వామి పరిపూర్ణానంద | - | Sakshi
Sakshi News home page

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతా స్వామి పరిపూర్ణానంద

Apr 4 2024 1:05 AM | Updated on Apr 4 2024 8:51 AM

- - Sakshi

హిందూపురం టౌన్‌: ‘‘బీజేపీ టికెట్‌ ఇస్తే ఆ పార్టీ సింబల్‌తో పోటీలో నిలుస్తా.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా హిందూపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తా’ అని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. వార్డులు, డయాలసిస్‌ కేంద్రం, సీటీ స్కాన్‌, ఎక్సరే విభాగాలను పరిశీలించారు. పలువురు రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు.

అనంతరం పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ... హిందూపురం అభివృద్ధికి ‘సప్తపది’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. మొదటి అడుగుగా గణేష్‌ సరోవరం, రెండో అడుగుగా హిందూపురం ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలు కూడా రూ.500 నోటుకు ఆశపడకుండా ఐదేళ్ల అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. దేశంలో హిందూపురాన్ని రోల్‌ మోడల్‌గా చేయాలన్నదే తన సంకల్పం అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement