నెల్లూరు (అర్బన్): బాపట్ల జిల్లా చుండూరు పోలీసుస్టేషన్‌పై దాడికి పాల్పడి సీఐను కులం పేరుతో దూషించిన కేసులో రిమాండ్ ఖైదీ బాలకోటిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు రిమాండ్ తరలించారు. గత నెల 23న రిమాండ్‌కు తరలించిన బాలకోటిరెడ్డి అధికార పార్టీ నేత కావడంతో మూడు రోజులకే సాధారణ చర్మవ్యాధి పేరుతో తన రాజకీయ పలుకుబడితో ఏకంగా పెద్దాస్పత్రిలో పెయిడ్ రూమ్‌లో పెట్టి రాజభోగాలు కల్పించారు. ఈ నేపథ్యంలో శనివారం ‘తమ్ముడు రిమాండ్ ఖైదీ అయితే..’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం కలవరపడింది. రిమాండ్ ఖైదీ బాలకోటిరెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా న్యాయమూర్తి ఆదేశాలు, అనుమతులు లేకుండా సాధారణ చర్మ వాధి పేరుతో పెయిడ్ రూమ్ కల్పించి, ఆయనకు పోలీసులు, డాక్టర్లు రాచమర్యాదలు చేయసాగారు. రిసార్ట్స్ వసతులు కల్పించారు. అదేదో నిషేధిత ప్రాంతమన్నట్లు ఆ క్యారిడార్‌లోకి కూడా రెండో వ్యక్తిని రాకుండా నర్సులు సైతం పొరబాటున అటు వైపు వెళ్లిన వారిని బెదిరించారు. ఖైదీలకే కాదు రోగులకు సైతం ఇలాంటి పే రూంలు ఇప్పటి వరకు పెద్దాస్పత్రిలో కేటాయించలేదు. ఇదే విషయాన్ని సాక్షి వెలుగులోకి తేవడంతో ప్రజల్లో చర్చనీయాంశంగా మారడంతో ఆగమేఘాల మీద నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,176 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


