బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌

Sep 6 2026 12:13 AM | Updated on Sep 6 2026 12:13 AM

ఇద్దరికి తీవ్రగాయాలు

పొదలకూరు: మోటార్‌ బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణానికి సమీపంలో నెల్లూరు–పొదలకూరు మార్గం కేఆర్‌ఆర్‌ లేఅవుట్‌ వద్ద శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్‌ మండలం ఆమంచర్లకు చెందిన గిరి మరో వృద్ధుడిని తన బైక్‌పై ఎక్కించుకుని పొదలకూరుకు వస్తుండగా నెల్లూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ తిరుపాల్‌, పైలెట్‌ శరత్‌లు క్షతగాత్రులను పొదలకూరు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement