
ఘనంగా జెండా పండగ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఆ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ స్వేచ్ఛ, స్వతంత్రానికి పూజ్య బాపూజీ దేశానికి స్వాతంత్య్రం తీసుకువస్తే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలకులు ఆంగ్లేయులను తలదన్నే రీతిలో నియంతల్లా పాలిస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గొప్ప పాలన అందించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అటవీక రాజ్యాన్ని తలపిస్తున్నాయన్నారు. టీడీపీ అకృత్యాలను చూసి ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తోపాటు కొంతమంది మహనీయులు కృషితో భారతదేశానికి గొప్ప రాజ్యాంగం తీసుకు వచ్చి ప్రజాస్వామ్య విలువలను సంరక్షించేలా విధానాలు రూపొందిస్తే ఈ రోజు ఆ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. పులివెందుల ఎలక్షన్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరు దుర్మార్గమన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీడియా గొంతు నొక్కి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో చేసిన అరాచకం ప్రజలందరూ చూశారన్నారు.