
విద్యార్థులకు అభినందన
నెల్లూరు (టౌన్): పార్థసారథినగర్‌లోని జెనెక్స్ బీ స్కూల్లో క్యాంపస్ డ్రైవ్‌ను బెంగళూరుకు చెందిన ఐటీ సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపికై న విద్యార్థులను స్కూల్లో శనివారం అభినందించిన అనంతరం చైర్మన్ వెంగళ్‌రెడ్డి, డైరెక్టర్ కొండలరావు మాట్లాడారు. ఇప్పటి వరకు అనేక డ్రైవ్‌లను నిర్వహించి 150 మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలను కల్పించామని వెల్లడించారు. కంపెనీ హెచ్‌ఆర్ శ్రీకన్య, పీజీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌తేజ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనిల్, ప్లేస్‌మెంట్ హెడ్ చరణ్‌తేజ తదితరులు పాల్గొన్నారు.
హత్య కేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): అలంకార్ సెంటర్‌లో ఇటీవల దారుణ హత్యకు గురైన లైఖ్ కేసులో నిందితులను చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు వెల్లడించారు. కేటరింగ్ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న కసాయివీధికి చెందిన లైఖ్ (36) వద్ద కోటమిట్ట మెక్లిన్స్ రోడ్డుకు చెందిన నూరుద్దీన్ అలియాస్ నూర్ పనిచేస్తున్నారు. తన భార్యతో చనువుగా ఉండేందుకు లైఖ్ యత్నించడంతో పాటుగా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడాన్ని నూర్ జీర్ణించుకోలేకపోయారు. లైఖ్‌ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకొని విషయాన్ని వైఎస్సార్‌నగర్‌కు చెందిన తన స్నేహితుడు ఉస్మాన్ అలియాస్ దావూకు చెప్పారు. నిందితులిద్దరూ కలిసి విక్టోరియా గార్డెన్స్ వద్ద లైఖ్‌ను ఈ నెల 13న హత్య చేసి పరారయ్యారు. మృతుడి అన్న రఫీ ఫిర్యాదు మేరకు హత్య కేసును పోలీసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఇన్‌స్పెక్టర్ ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భగత్‌సింగ్ కాలనీలోని టిడ్కో ఇళ్ల సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు కత్తులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందన