
తేలుకాటుతో బాలుడి మృతి
కావలి (జలదంకి): తేలుకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కావలి రూరల్ మండలం గౌరవరం ఎస్టీ కాలనీకి చెందిన చౌటూరి చిన్నయ్య పట్టణంలోని పుల్లారెడ్డినగర్‌లో గల వాటర్ ప్లాంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆయన రెండో కుమారుడు శ్రీనివాసుడు (11) స్థానికంగా ఉన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ కొంతకాలంగా స్కూల్‌కు వెళ్లడంలేదు. ఈ క్రమంలో ఇంటి వెనుక ఉన్న తాటి చెటెక్కి పండ్లు కోస్తుండగా, తేలు కుట్టింది. దీంతో జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపడంతో చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. కావలి రూరల్ ఎస్సై బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొన్న బస్సు
● క్లీనర్ దుర్మరణం
గుడ్లూరు: లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో క్లీనర్ మృతి చెందిన ఘటన తెట్టు ఫ్లయ్‌ఓవర్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఘటనలో బస్సు క్లీనర్ ఉండ్రరాశి సంతోష్ (27) మృతి చెందారు. మృతుడ్ని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాలకు చెందిన వారిగా గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలిచారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వెంకట్రావు తెలిపారు.