
వైఎస్సార్సీపీలో 20 కుటుంబాల చేరిక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): టీడీపీని 20 కుటుంబాలు వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీ పదో డివిజన్ నేత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వీరు పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రామ్‌జీనగర్‌లోని పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించిన అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని బలోపేతానికి పనిచేయాలని సూచించారు. జగనన్నను మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా వ్యవహరించాలని కోరారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో తగిన ప్రాధాన్యమిస్తామని చెప్పారు.