
ఇస్కాన్‌లో వేడుకగా కృష్ణాష్టమి
నెల్లూరు(బృందావనం): ఇస్కాన్ సిటీలోని ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో శనివారం నిర్వహించారు. మందిరంలో కొలువైన రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలను విశేషంగా జరిపారు. జగన్నాథ, సుభద్ర, బలరాములు విశేషాలంకారంలో దర్శనమిచ్చారు. కృష్ణ భగవానుడికి ఊంజల్‌సేవను నిర్వహించారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ముద్రించిన సావనీర్‌ను మందిరాధ్యక్షుడు శుఖదేవస్వామి ఆవిష్కరించి, భక్తులకు అందజేశారు. కృష్ణ భగవానుడికి అభిషేక మహోత్సవాన్ని నిర్వహించి 108 వంటకాలతో నివేదన చేసి మహా హారతినిచ్చారు.
శ్రీలప్రభుపాద వ్యాసపూజ నేడు
ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీలప్రభుపాద వ్యాస పూజను ఆదివారం నిర్వహించనున్నామని శుఖదేవస్వామి తెలిపారు. హారతి, 56 వంటకాలతో నివేదన తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నామని, భక్తులు తరలిరావాలని కోరారు.
● పూజా కార్యక్రమాలకు ఎస్పీ కృష్ణకాంత్ దంపతులు హాజరయ్యారు.

ఇస్కాన్‌లో వేడుకగా కృష్ణాష్టమి