
గౌతు లచ్చన్న జీవితం ఆచరణీయం
నెల్లూరు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జీవితం నేటి తరానికి ఆచరణీయమని జేసీ కార్తీక్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గౌతు లచ్చన్న జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మమ్మ, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి, జిల్లా టూరిజం అధికారి ఉషశ్రీ, మత్స్యశాఖ జేడీ శాంతి, బీసీ నేతలు జనార్దన్‌రాజు, జనార్దన్‌గౌడ్, ఉప్పు భాస్కర్, పద్మజాయాదవ్, శ్రీనివాసులు, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
నెల్లూరు(క్రైమ్): నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గౌతు లచ్చన్న జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎస్పీ కృష్ణకాంత్ నివాళులర్పించారు.

గౌతు లచ్చన్న జీవితం ఆచరణీయం