
కలెక్టరేట్‌లో పంద్రాగస్టు వేడుకలు
నెల్లూరు రూరల్ : 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు కలెక్టరేట్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లోని జాతిపిత విగ్రహానికి కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్‌ఓ హుస్సేన్‌సాహెబ్, పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 100 అడుగుల స్థూపం వద్ద జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులకు కలెక్టర్ మిఠాయిలు పంచి పెట్టారు. కలెక్టరేట్ ఏఓ విజయకుమార్, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, డీసీఓ గుర్రప్ప, సమాచార పౌరసంబంధాల అధికారి ఎ.శివశంకర్‌రావు, పౌర సరఫరాలశాఖ అధికారి విజయ్‌కుమార్, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.