
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా గిల్ వందకు వంద మార్క్‌లు కొట్టేశాడు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే అందరని ఆకట్టుకున్నాడు.
అతడి సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2 సమం చేసింది. అదేవిధంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో గిల్ 754 లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో గిల్‌పై టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో జట్టును బాగా నడిపించాడని గిల్‌ను యువీ కొనియాడాడు. కాగా గిల్ రోల్ మోడల్ యువీనే కావడం విశేషం.
"ఇంగ్లండ్ టూర్‌కు ముందు గిల్ విదేశీ రికార్డులపై ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉండేవి. కానీ వాటిన్నటిని ఒక్క సిరీస్‌తో చెరిపేశాడు. కెప్టెన్ అయ్యాక అతడు ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో ఏకంగా నాలుగు టెస్టు సెంచరీలు చేశాడు. కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లో ఈ విధమైన ప్రదర్శన కనబరిచడం నిజంగా అత్యద్బుతం.
ఓవల్‌లో చారిత్రత్మక విజయం సాధించిన భారత జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. డ్రా అయినప్పటికి సిరీస్ మనదేనని భావిస్తున్నాను. ఎందుకంటే ఇది యువ భారత జట్టు. ఇంగ్లండ్ వంటి జట్టుతో సిరీస్ డ్రా చేయడం అంత సులువు కాదు. అదేవిధంగా జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు కూడా అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.
చాలా రోజుల తర్వాత ఇద్దరూ భారత బ్యాటర్లు సెంచరీలు చేసి మ్యాచ్‌ను డ్రా ముగించడం చూశాను. జడేజా ఎప్పటి నుంచో జట్టుకు తన సేవలను అందిస్తున్నాడు. కానీ సుందర్ మాత్రం ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా గ్రేట్" అని యువరాజ్ ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: కెప్టెన్‌గా రుతురాజ్‌పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు