యూకీ బాంబ్రీకి తొలి ఏటీపీ టైటిల్‌  | Yuki Bhambri Wins Maiden ATP Doubles Title | Sakshi
Sakshi News home page

Mallorca Championships: యూకీ బాంబ్రీకి తొలి ఏటీపీ టైటిల్‌ 

Jul 2 2023 10:21 AM | Updated on Jul 2 2023 10:21 AM

Yuki Bhambri Wins Maiden ATP Doubles Title - Sakshi

మలోర్కా (స్పెయిన్‌): భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ప్లేయర్‌ యూకీ బాంబ్రీ తన కెరీర్‌లో తొలి ఏటీపీ టోర్నీ డబుల్స్‌ టైటిల్‌ సాధించాడు. మలోర్కా చాంపియన్‌షిప్‌ ఏటీపీ–250 టోర్నీ లో యూకీ బాంబ్రీ (భారత్‌) –లాయిడ్‌ హారిస్‌ (దక్షిణాఫ్రికా) ద్వయం విజేతగా నిలి చింది.

పురుషుల డబుల్స్‌ ఫైనల్లో యూకీ–హారిస్‌ జోడీ 6–3, 6–4తో రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌)–ఒస్వాల్డ్‌ (ఆస్ట్రియా) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన యూకీ–హారిస్‌ జోడీకి 48,380 యూరోల (రూ. 43 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement