సహజకు ఐటీఎఫ్‌ టైటిల్‌ | Sahaja Yamalapalli won the International Tennis Federation doubles title | Sakshi
Sakshi News home page

సహజకు ఐటీఎఫ్‌ టైటిల్‌

Oct 11 2026 3:57 AM | Updated on Oct 11 2026 3:57 AM

Sahaja Yamalapalli won the International Tennis Federation doubles title

సాక్షి, హైదరాబాద్‌: భారత యువ టెన్నిస్‌ ప్లేయర్‌ సహజ యామలపల్లి అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబుల్స్‌ టైటిల్‌ సాధించింది. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్న సహజ... అమెరికాలోని సౌత్‌ కరోలినాలో జరిగిన టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సహజ–డై ఎల్‌ జార్డీ (మొరాకో) జంట 2–6, 7–5, 12–10తో టాప్‌ సీడ్‌ డలైనా హెవిట్‌ (అమెరికా)–వలేరియా స్ట్రాకోవా (ఉక్రెయిన్‌) ద్వయంపై విజయం సాధించింది. 

ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సహజ జోడీ... తుదిపోరులో తొలి సెట్‌ కోల్పోయిన అనంతరం అది్వతీయ పోరాటంతో విజేతగా నిలిచింది. అంతకుముందు సెమీఫైనల్లో సహజ–ఎల్‌జార్డీ 7–5, 7–6 (7/1)తో మూడో సీడ్‌ మేగన్‌ హుసెర్‌ (అమెరికా)–కాటె షరాబురా (అమెరికా)పై, క్వార్టర్స్‌లో 6–2, 6–3తో హినా ఇనోవు (అమెరికా)–యూకీ నైటో (జపాన్‌)పై విజయాలు సాధించి ముందంజ వేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement