ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్‌లలో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల టెన్నిస్ జట్లను ప్రకటించారు. మహిళల జట్టులో భారత సింగిల్స్ నంబర్‌వన్, హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి... పురుషుల జట్టులో హైదరాబాద్‌కు చెందిన డబుల్స్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్‌లకు స్థానం లభించింది.
హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. భారత పురుషుల జట్టులో సుమిత్ నగాల్, మానస్ ధామ్నె, దక్షిణేశ్వర్ సురేశ్, యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ, ... భారత మహిళల జట్టులో వైష్ణవి అడ్కర్, వైదేహి, రుతుజా, ప్రార్థన, అంకిత రైనా కూడా చోటు సంపాదించారు.


