సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రితి్వక్ చౌదరీ ఈ ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. అమెరికాలో జరిగిన టెక్సాస్ స్పైన్ అండ్ జాయింట్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టోర్నీలో రిత్విక్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ విజేతగా నిలిచింది.
తుది పోరులో టాప్ సీడ్ రిత్విక్–రామ్ ద్వయం 7–6 (7/2), 7–6 (7/4)తో జచారి ఫుచ్స్–వ్యాలీ థేన్ (అమెరికా) జంటపై నెగ్గింది. రిత్విక్–రామ్ జంటకు 4,980 డాలర్ల (రూ. 4 లక్షల 72 వేలు) ప్రైజ్‌మనీ, 75 పాయింట్లు లభించాయి. గత ఏడాది శాంటియాగో ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో నికోలస్ బరియంతోస్ (కొలంబియా)తో కలిసి రిత్విక్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.


