ఫొన్సెకా మరో సంచలనం! | Joao Fonseca's Performance at the French Open Grand Slam tennis tournament | Sakshi
Sakshi News home page

ఫొన్సెకా మరో సంచలనం!

Jun 2 2026 9:39 AM | Updated on Jun 2 2026 12:30 PM

Joao Fonseca's Performance at the French Open Grand Slam tennis tournament

రెండుసార్లు రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌పై విజయం

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో బ్రెజిల్‌ టీనేజర్‌ జోవో ఫొన్సెకా సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ను బోల్తా కొట్టించిన 19 ఏళ్ల ఫొన్సెకా... ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 15వ సీడ్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన కాస్పర్‌ రూడ్‌ను ఓడించాడు. తద్వారా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

3 గంటల 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫొన్సెకా 7–5, 7–6 (10/8), 5–7, 6–2తో రూడ్‌పై గెలిచాడు. 11వ సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. రుబ్లెవ్‌ 3–6, 6–7 (6/8), 6–4, 6–2, 3–6తో మెన్‌సిక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడిపోయాడు. పదో సీడ్‌ కొ»ొల్లి (ఇటలీ), నాలుగో సీడ్‌ ఫెలిక్స్‌ అగర్‌ (కెనడా), అన్‌సీడెడ్‌ బెరెటెని (ఇటలీ) కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కొ»ొల్లి 6–2, 6–3, 6–7 (3/7), 7–6 (7/5)తో జచెరీ వజ్దా (అమెరికా)పై, ఫెలిక్స్‌ 6–3, 7–5, 6–1తో అలెజాంద్రో టబిలో (చిలీ)పై, బెరెటిని 6–3, 7–6 (7/2), 7–6 (8/6)తో యువాన్‌ మాన్యుయెల్‌ సెరున్‌డొలో (అర్జెంటీనా)పై గెలిచారు.

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మాజా చావ్లిన్‌స్కా (పోలాండ్‌) 6–3, 6–2తో డయానా ప్యారీ (ఫ్రాన్స్‌)పై, డయానా ష్నయిడర్‌ (రష్యా) 6–3, 3–6, 6–0తో మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై, కలిన్‌స్కాయా (రష్యా) 6–4, 2–6, 7–6 (10/7)తో అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌ మూడో రౌండ్‌లో శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–డెమోలైనర్‌ (బ్రెజిల్‌) ద్వయం 7–5, 6–4తో కెవిన్‌ క్రావిట్జ్‌–టిమ్‌ ప్యుట్జ్‌ (జర్మనీ) జంటపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement