సరికొత్త చరిత్ర.. తొలి ప్లేయర్‌గా ఘనత | Jannik Sinner Breaks Djokovic’s Record With 32nd Consecutive Masters 1000 Win At Rome Open | Sakshi
Sakshi News home page

సరికొత్త చరిత్ర.. తొలి ప్లేయర్‌గా ఘనత

May 15 2026 9:53 AM | Updated on May 15 2026 11:15 AM

Italian Open: Jannik Sinner Breaks Djokovic Record

రోమ్‌: ప్రతిష్టాత్మక మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలలో యానిక్‌ సినెర్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలలో అత్యధిక వరుస విజయాలు సాధించిన ప్లేయర్‌గా ఈ ఇటలీ స్టార్‌ గుర్తింపు పొందాడు. 

రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టోర్నీలో భాగంగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ సినెర్‌ 6–2, 6–4తో రుబ్లెవ్‌ (రష్యా)ను ఓడించాడు. తద్వారా మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలలో వరుసగా 32వ విజయం అందుకున్నాడు. సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ (2011లో 31 వరుస విజయాలు) పేరిట ఉన్న రికార్డును సినెర్‌ బద్దలు కొట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement