మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి నెట్వర్క్ ద్వారా ఆటగాళ్లను రిక్రూట్ చేస్తున్నాడన్న ఆరోపణలపై సెర్బియా టెన్నిస్ ప్లేయర్ స్టెఫాన్ మిలిసెవిచ్పై 24 ఏళ్ల నిషేధం పడింది. 29 ఏళ్ల మిలిసెవిచ్పై అక్టోబర్ 2050 వరకు నిషేధం అమల్లో ఉంటుందని అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) తెలిపింది. దీంతో పాటు అతడిపై డెబ్బైవేల జరిమానా కూడా విధించినట్లు స్పష్టం చేసింది.
2022 నుంచి 2024 మధ్యకాలంలో, తాను పోటీ పడిన ఐదు మ్యాచ్‌లతో సహా ఆరు మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసినందుకు, మరో ఆరు మ్యాచ్‌లను కూడా ఫిక్సింగ్ చేయాలని ప్రయత్నించినట్లు మిలిసెవిచ్పై అభియోగాలు మోపబడ్డాయి. ఇదే సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేసేందుకు ఒక నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రొఫెషనల్ ఆటగాళ్లను నియమించడం లేదా నియమించుకోవడానికి ప్రయత్నించినట్లు ఐటీఐఏ మిలిసెవిచ్పై ఆరోపణలు చేసింది.
అయితే సెర్బియాకు చెందిన స్టెఫాన్ మిలిసెవిచ్ ఎక్కువగా దిగువ స్థాయి టోర్నీల్లో పాల్గొనేవాడు. 2014 ప్రకారం సింగిల్స్‌లో అత్యధికంగా 1,338వ ర్యాంకును సాధించాడు. అయితే, ఇందులో ప్రమేయం ఉన్న మ్యాచ్‌ల వివరాలను గానీ, ఇందులో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఆటగాళ్ల పేర్లను గానీ ఆ ఏజెన్సీ వెల్లడించలేదు.
ఇదే విషయమై మిలిసెవిచ్ను ఏడుసార్లు విడివిడిగా విచారణ చేసినప్పటికీ, తమ దర్యాప్తుకు సహకరించుకుండా పొంతన లేని సమాధానాలు ఇస్తూ వచ్చాడని ఐటీఐఏ తెలిపింది. దీంతో అతడిపై 24 ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు పేర్కొంది.
ఈ నిషేధం కారణంగా అతను ATP, WTA, గ్రాండ్ స్లామ్స్, వరల్డ్ టెన్నిస్ లేదా ఏదైనా జాతీయ టెన్నిస్ సంఘం నిర్వహించే లేదా ఆమోదించే ఈవెంట్లలో ఆడటం, కోచింగ్ ఇవ్వడం లేదా హాజరుకావడం వంటివి చేయకూడదు. మిలిసెవిచ్కు 53 ఏళ్లు వచ్చే వరకు టెన్నిస్ ఆడకుండా నిషేధం అమల్లో ఉంటుంది.
ఇదీ చదవండి:


