సింగిల్స్‌ విజేతల ఖాతాలో రూ. 35 కోట్లు | Wimbledon organizers announce prize money details | Sakshi
Sakshi News home page

సింగిల్స్‌ విజేతల ఖాతాలో రూ. 35 కోట్లు

Jun 13 2025 3:25 AM | Updated on Jun 13 2025 9:45 AM

Wimbledon organizers announce prize money details

ప్రైజ్‌మనీ వివరాలను ప్రకటించిన వింబుల్డన్‌ నిర్వాహకులు  

లండన్‌: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు సంబంధించి ప్రైజ్‌మనీ వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు 30 లక్షల పౌండ్‌ల (రూ. 35 కోట్లు) చొప్పున లభిస్తాయి. రన్నరప్‌గా నిలిచిన క్రీడాకారులకు 15 లక్షల 20 వేల పౌండ్‌ల (రూ. 17 కోట్ల 68 లక్షలు) చొప్పున అందజేస్తారు. 

సెమీఫైనల్లో ఓడిన వారికి 7,75,000 పౌండ్‌ల (రూ. 9 కోట్లు) చొప్పున... క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగిన వారికి 4 లక్షల పౌండ్‌ల (రూ. 4 కోట్ల 65 లక్షలు) చొప్పున... ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పరాజయం పాలైన వారికి 2,40,000 పౌండ్‌ల (రూ. 2 కోట్ల 79 లక్షలు) చొప్పున లభిస్తాయి. మూడో రౌండ్‌లో ఓడిన వారికి 1,52,000 పౌండ్‌ల (రూ. 1 కోటీ 72 లక్షలు) చొప్పున... రెండో రౌండ్‌లో వెనుదిరిగిన వారికి 99 వేల పౌండ్‌ల (రూ. 1 కోటీ 15 లక్షలు) చొప్పున, తొలి రౌండ్‌లో ఓడిన వారికి 66 వేల పౌండ్‌ల (రూ. 77 లక్షలు) చొప్పున అందజేస్తారు. 

పురుషుల, మహిళల డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించిన జోడీలకు 6,80,000 పౌండ్‌ల (రూ. 7 కోట్ల 91 లక్షలు) చొప్పున లభిస్తాయి. ఈ ఏడాది వింబుల్డన్‌ టోర్నీ జూన్‌ 30 నుంచి జూలై 13వ తేదీ వరకు జరుగుతుంది. గత సంవత్సరం పురుషుల సింగిల్స్‌లో అల్‌కరాజ్, మహిళల సింగిల్స్‌లో క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) టైటిల్స్‌ సాధించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement