తృటిలో ఓట‌మి త‌ప్పించుకున్న నంబ‌ర్‌వ‌న్ ప్లేయర్‌ | Jannik Sinner survives Scare-To-Beat-Miomir Kecmanovic-Wimbledon Opener | Sakshi
Sakshi News home page

Wimbledon 2026: తృటిలో ఓట‌మి త‌ప్పించుకున్న నంబ‌ర్‌వ‌న్ ప్లేయర్‌

Jun 30 2026 2:34 AM | Updated on Jun 30 2026 4:54 AM

Jannik Sinner survives Scare-To-Beat-Miomir Kecmanovic-Wimbledon Opener

వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ జానిక్ సిన్న‌ర్ తృటిలో ఓట‌మి నుంచి త‌ప్పించుకున్నాడు. సింగిల్స్ తొలి రౌండ్‌లో సిన్న‌ర్ 4-6, 6-3, 6-7(6/8), 6-2, 6-3తో సెర్బియాకు చెందిన మియోమిర్ కెమ‌నోవిక్‌పై క‌ష్ట‌ప‌డి గెలిచాడు. మూడున్నర గంట‌ల పాటు జ‌రిగిన‌ ఐదుసెట్ల‌ మ్యాచ్‌లో సిన్న‌ర్ ఒక ద‌శ‌లో వెనుక‌బ‌డి ఓటమి వైపు సాగాడు. 

దీనికి తోడు మూడో సెట్ టై బ్రేక్‌కు దారి తీయ‌డం, టై బ్రేక్‌లో కెమ‌నోవిక్ సెట్‌ను గెలుచుకోవ‌డంతో మ్యాచ్ హోరాహోరిగా సాగింది. అయితే నాలుగో సెట్‌లో వెనుక‌బ‌డ్డ కెమ‌నోవిక్ ఐదో సెట్‌లో తొలి గేమ్ గెలిచిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత ఫుంజుకోలేక‌పోయాడు. అయితే ఐదు సెట్ల దాకా పోరాడిన కెమ‌నోవిక్ మాత్రం సిన్న‌ర్‌కు ముచ్చెమ‌టలు ప‌ట్టించాడు. ఇక రెండో రౌండ్‌లో సిన్నర్‌ పోర్చుగ‌ల్‌కు చెందిన నూనో బోర్జెస్‌తో త‌ల‌ప‌డ‌నున్నాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో నొవాక్‌ జకోవిచ్‌, డానిల్ మెద్వెదెవ్‌, సిట్సిపాస్ ముందంజ వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement