ఆర్సీబీలోకి బుమ్రా, సూర్య‌కుమార్‌, పంత్‌: విజయ్‌ మాల్యా డ్రీమ్‌ టీమ్‌ | Vijay Mallya Names His Dream RCB 11 | Sakshi
Sakshi News home page

ఆర్సీబీలోకి బుమ్రా, సూర్య‌కుమార్‌, పంత్‌: విజయ్‌ మాల్యా డ్రీమ్‌ టీమ్‌

Jun 8 2025 7:58 AM | Updated on Jun 8 2025 8:03 AM

Vijay Mallya Names His Dream RCB 11

ఐపీఎల్‌-2025 ఛాంపియన్‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఫైన‌ల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆర్సీబీ.. త‌మ 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెరదించుతూ తొలి టైటిల్‌ను ముద్దాడింది. ఈ నేప‌థ్యంలో ఆర్సీబీ మాజీ యాజ‌మాని విజ‌య్ మాల్యా పేరు తెర‌పైకి వ‌చ్చింది.

ఎందుకంటే ఆర్సీబీకి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ గుర్తింపును తీసుకురావడంలో ఆయ‌న‌ది కీల‌క పాత్ర‌. ఐపీఎల్ ఆరంభం వేలంలో విరాట్ కోహ్లిని కూడా ఆర్సీబీ సొంతం చేసుకోవ‌డం మాల్యా నిర్ణ‌యమే. ఆ త‌ర్వాత ఏబీ డివిలియ‌ర్స్‌, క్రిస్ గేల్ వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్ల‌ను త‌మ జ‌ట్టులోకి తీసుకు రావ‌డానికి ఆయ‌న కృషి చేశారని క్రికెట్ నిపుణులు ఇప్పటికి అభిప్రాయపడుతుంటారు.

 ఆర్సీబీ తొలి టైటిల్ విజయనంతరం మాల్యా సెలబ్రేషన్స్‌ కూడా చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ క్రమంలో తాజాగా రాజ్ షమానీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాల్యా తన ఆర్సీబీ డ్రీమ్ టీమ్‌ను ఎంచుకున్నాడు. ఇప్పటికిప్పుడు బెంగళూరు జట్టులోకి ఏ ప్లేయర్లను కొనుగోలు చేస్తారన్న ప్రశ్న మాల్యాకు ఎదురైంది.

"నాకు అవకాశం​ వస్తే.. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌, కేఎల్ రాహుల్‌ను కొనుగోలు చేస్తాను. వీరి మినహా నాకు మరెవరూ అవసరం లేదు. ఈ నలుగురు ప్లేయర్లు జట్టులో ఉంటే చాలు, ట్రోఫీ ఈజీగా గెలవచ్చు" అని మాల్యా పేర్కొన్నారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మాల్యా.. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నాడు
చదవండి: French Open 2025: ఫ్రెంచ్ ‘క్వీన్‌’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి

Advertisement
 
Advertisement
Advertisement