ఫ్రెంచ్ ‘క్వీన్‌’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి | Coco Gauff Clinches Maiden French Open Title By Defeating World No.1 Aryana Sabalenka | Sakshi
Sakshi News home page

French Open 2025: ఫ్రెంచ్ ‘క్వీన్‌’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి

Jun 7 2025 10:03 PM | Updated on Jun 8 2025 8:21 AM

Coco Gauff Clinches Maiden French Open Title By Defeating World No.1 Aryana Sabalenka

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన అమెరికా స్టార్‌ కోకో గాఫ్‌

హోరాహోరీ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకాపై అద్భుత విజయం

రూ. 24 కోట్ల 91 లక్షల ప్రైజ్‌మనీ సొంతం   

పారిస్‌: ఎర్రమట్టి కోటకు కొత్త రాణి వచ్చింది. అమెరికాకు చెందిన 21 ఏళ్ల కోకో గాఫ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ కొత్త చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్‌ కోకో గాఫ్‌ 6–7 (5/7), 6–2, 6–4తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ అరీనా సబలెంకా (బెలారస్‌)పై విజయం సాధించింది. 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ సమరంలో కోకో గాఫ్‌ తొలి సెట్‌ను కోల్పోయినా అధైర్యపడకుండా అసమాన పోరాటపటిమతో కోలుకుని సబలెంకాను బోల్తా కొట్టించింది.

 కోకో గాఫ్‌ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌కాగా, తొలిసారి ఆమె ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. 2023 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో సబలెంకాపైనే గెలిచి కోకో గాఫ్‌ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అందుకోవడం విశేషం. 2022 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిసారి ఫైనల్‌ చేరిన కోకో గాఫ్‌ పోలాండ్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 

రెండో ప్రయత్నంలో మాత్రం కోకో అత్యుత్తమ ఆటతీరుతో విన్నర్స్‌ ట్రోఫీని ముద్దాడింది. చాంపియన్‌గా నిలిచిన కోకో గాఫ్‌కు 25 లక్షల 50 వేల యూరోలు (రూ. 24 కోట్ల 91 లక్షలు), రన్నరప్‌ సబలెంకాకు 12 లక్షల 75 వేల యూరోలు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

తడబడి తేరుకొని... 
సబలెంకాతో జరిగిన తుది పోరులో కోకో గాఫ్‌ మ్యాచ్‌ కొనసాగినకొద్దీ రాటుదేలింది. తొలి సెట్‌ ఆరంభంలో 1–4తో వెనుకబడిన కోకో నెమ్మదిగా తేరుకుంది. సబలెంకా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసి స్కోరును 4–4తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. టైబ్రేక్‌లో సబలెంకా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. 

రెండో సెట్‌లో కోకో అనూహ్యంగా విజృంభించగా, సబలెంకా తడబడింది. కోకో కేవలం రెండు గేమ్‌లు చేజార్చుకొని ఈ సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో సబలెంకా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసిన కోకో తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో స్టెఫీ గ్రాఫ్‌ (జర్మనీ) తర్వాత (1999లో మారి్టనా హింగిస్‌పై) వరల్డ్‌ నంబర్‌వన్‌తో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో తొలి సెట్‌ కోల్పోయాక కూడా విజేతగా నిలిచిన రెండో ప్లేయర్‌గా కోకో గాఫ్‌ గుర్తింపు పొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement