
టీమిండియాతో వచ్చే నెలలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు 'స్పెషల్ స్కిల్స్ కన్సల్టంట్’ న్యూజిలాండ్ పేస్ దిగ్గజం టిమ్ సౌథీని ఇంగ్లండ్ క్రికెట్ నియమించింది. టిమ్ సౌథీ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన అపార అనుభవంతో ఇంగ్లండ్ క్రికెట్‌ను ముందుకు నడిపిస్తాడు అని ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా
ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ జేమ్స్ ఆండర్సన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఇప్పటివరకు జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లండ్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. అయితే అతడు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లంకాషైర్ తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సౌథీతో ఈసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జింబాబ్వేతో జరగనున్న ఏకైక టెస్టుతో సౌథీ తన కొత్త ప్రయాణాన్ని ఆరంభించనున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్ క్యాంపులో చేరిన సౌథీ.. దగ్గరుండి ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తున్నాడు.
కాగా గత డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన సౌథీ.. భారత్‌పై మెరుగైన రికార్డును కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం కూడా ఉంది. ఈ క్రమంలోనే బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో కూడిన కోచింగ్ బృందంలో సౌథీని ఈసీబీ చేర్చింది. సౌథీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
వన్డేల్లో 221 వికెట్లు పడగొట్టిన సౌథీ..టెస్టుల్లో 391, టీ20ల్లో 164 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో సైకిల్‌లో భాగంగా జరగనుంది. జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
Our new Specialist Skills Consultant 😍
We're delighted to announce that Tim Southee, New Zealand’s all-time leading wicket-taker, is joining us on a short-term basis.
Read more 👇— England Cricket (@englandcricket) May 15, 2025
చదవండి: IPL 2025: పంజాబ్ జట్టులోకి డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ.. ఇక దబిడి దిబిడే?