డిసెంబర్ 8 నుంచి ఎల్బీ స్టేడియంలో నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ఎనిమిదో సీజన్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 13 వరకు జరగనున్న ఈ టోర్నీకి నగరంలోని ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్న ఈ ఈవెంట్‌లో 25 పాయింట్ల ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్‌లో హైదరాబాద్ స్ట్రయికర్స్‌తో పాటు ఢిల్లీ ఏసెస్, లక్నో బ్లేజర్స్, గుర్‌గావ్ గ్రాండ్‌స్లామర్స్, గుజరాత్ పాంథర్స్, రాజస్తాన్ రేంజర్స్, కోల్‌కతా థండర్ బ్లేడ్స్, ముంబై రాయల్స్ పాల్గొంటున్నాయి.
గత సీజన్ అహ్మదాబాద్‌లో జరగగా... ఈసారి లీగ్ హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ‘టీపీఎల్ ఎనిమిదో సీజన్ ఒక మైలురాయి లాంటిది. కియా ఇండియాతో మా భాగస్వామ్యం కార్యరూపం దాల్చడాన్ని హైదరాబాద్ అభిమానులు చూడనున్నారు. ఈ లీగ్ ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇదొక సంకేతం. హైదరాబాద్‌లోని క్రీడా సంస్కృతి మా ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చనుంది’ అని టీపీఎల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ ఠక్కర్ వెల్లడించాడు.


