breaking news
Tennis Premier League
-
TPL: అదరగొట్టిన హైదరాబాద్ స్ట్రైకర్స్.. వరుసగా రెండో టైటిల్
Tennis Premier League Season 4- పుణె: టెన్నిస్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) సీజన్ 4 చాంఫియన్స్‌గా హైదరాబాద్ స్ట్రైకర్స్ అవతరించింది. తద్వారా వరుసగా రెండో సారి చాంఫియన్‌షిప్ గెలుచుకుంది. లీగ్ చివరి రోజులో భాగంగా మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. తొలి సెమీ ఫైనల్లో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్, చెన్నై స్టాలియన్స్ తలపడ్డాయి. ఈ క్రమంలో.. హైదరాబాద్ స్ట్రైకర్స్‌కు చెందిన కొన్నీ పెర్రిన్, చెన్నై స్టాలియన్స్‌కు చెందిన ఎకటెరీనా కజియోనోవాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు. ఈ మ్యాచ్ 10–10తో డ్రాగా ముగియగా... ఆ తరువాత మెన్స్ సింగిల్స్ మ్యాచ్ జరిగింది. ఆ పోటీలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్‌కు చెందిన నిక్కీ పూనాచా, చెన్నై స్టాలియన్స్‌కు చెందిన మథియాస్ బౌర్గీపై 13–7తో విజయం సాధించారు. ఈ మ్యాచ్ అనంతరం మిక్స్డ్ డబుల్స్ పోటీలు జరిగగాయి. ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్‌కు చెందిన శ్రీరామ్ బాలాజీ , కొన్నీ పెర్రిన్లు, చెన్నై స్టాలియన్స్‌కు చెందిన ఎకటెరినా కజియోనోవా, అనిరుద్ చంద్రశేఖర్‌ల మధ్య జరిగాయి. ఈ పోటీలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ 13–7తో విజయం సాధించింది. ఇదే జోరును కొనసాగిస్తూ మెన్స్ డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ, నిక్కీ పూనాచాలు.. చెన్నై స్టాలియన్స్‌కు చెందిన మథయాస్ బౌర్గీ మరియు అనిరుధ్ చంద్రశేఖర్‌పై 12–8తో విజయం సాధించారు. ఈ క్రమంలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ 48–32 పాయింట్లతో చెన్నై స్టాలియన్స్‌పై పూర్తి ఆధిపత్యం చాటుకుని ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. రెండో సెమీ ఫైనల్ ఇలా ఇక రెండో సెమీ ఫైనల్స్ పోటీలలో ముంబై లియాన్ ఆర్మీ, బెంగళూరు స్పార్టన్స్‌తో పోటీపడింది. బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన కర్మాన్ కౌర్ థండి, ముంబై లియాన్ ఆర్మీకి చెందిన ఆకాంక్ష నిట్టర్పై 13– 7స్కోర్‌తో మహిళల సింగిల్స్‌లో విజయం సాధించింది. మెన్స్ సింగిల్ విభాగంలో ముంబై లియాన్ ఆర్మీకి చెందిన రామ్‌కుమార్ రామనాథన్, బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన సిద్ధార్ధ్ రావత్‌పై 11–9 స్కోర్‌తో విజయం సాధించాడు. అదే విధంగా... మిక్స్డ్ డబుల్స్ పోటీలలో ముంబై లియాన్ ఆర్మీకి చెందిన జీవన్ నెడుంచెంజియాన్ మరియు ఆకాంక్ష నెట్టూరిలు బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన విష్ణు వర్ధన్, కర్మాన్కౌర్లతో పోటీపడ్డారు. ఈ పోటీలో 12–8 స్కోర్‌తో బెంగళూరుపై ముంబై విజయం సాధించింది. ఇక మెన్స్ డబుల్స్ పోటీలలో ముంబై లియాన్ ఆర్మీకి చెందిన రామ్‌కుమార్ రామనాథన్ మరియు జీవన్ నెడుంచెంజియాన్లు బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన సిద్ధార్ధ్ రావత్, విష్ణు వర్ధన్ పై 11–9 స్కోర్‌తో విజయం సాధించారు. ఫైనల్లో మరోసారి ఈ క్రమంలో ముంబై లియాన్ ఆర్మీ 41–39 స్కోర్‌తో ఫైనల్స్‌లో ప్రవేశించారు. దీంతో గత సీజన్ మాదిరే ముంబై లియాన్ ఆర్మీ, ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ మధ్య టైటిల్ కోసం పోరు జరిగింది. ఇందులో భాగంగా.. మహిళల సింగిల్స్ విభాగంలో మ్యాచ్ తొలుత జరిగింది. ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్‌కు చెందిన కొన్నీ పెరిన్, ముంబై లియాన్ ఆర్మీ కి చెందిన ఆకాంక్ష నిట్టర్తో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో 13–7తో కొన్నీ పెర్రిన్ విజయం సాధించారు. ఈ మ్యాచ్ అనంతరం మెన్స్ సింగిల్ విభాగపు పోటీలు జరిగాయి. దీనిలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్‌కు చెందిన నిక్కీ పూనాచా, ముంబై లియాన్ ఆర్మీ కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో పోటీపడ్డారు. ఈ పోటీలో నిక్కీ పూనాచా 12–8 తో విజయం సాధించారు. ఆ తరువాత మిక్స్డ్ డబుల్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ తరపున శ్రీరామ్ బాలాజీ మరియు కొన్నీ పెర్రిన్ పోటీపడగా, ముంబై లియాన్ ఆర్మీ తరపున జీవన్ నెడుంచెంజియాన్, ఆకాంక్ష నెట్టూరి పోటీపడ్డారు. ఈ మ్యాచ్ 13–7 స్కోర్‌తో ముంబై లియాన్ ఆర్మీ గెలిచింది. ఆ తరువాత విభాగపు పోటీలుగా మెన్స్ డబుల్స్ జరిగాయి. నిక్కీ పూనాచా మరియు శ్రీరామ్ బాలాజీలు ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ సై్ట్రకర్స్ తరపున పోటీపడగా, రామ్‌కుమార్ రామనాథన్ మరియు జీవన్ నెండుంచెంజియాన్ ముంబై లియాన్ ఆర్మీ తరపున పోటీపడ్డారు. ఈ పోటీలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ సై్ట్రకర్స్ 14–6 తో విజయం సాధించింది. ఈ క్రమంలో ఫైనల్ స్కోర్ 41–32 కాగా ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ విజేతగా నిలిచింది. తద్వారా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ తమ చాంఫియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. కాగా టెన్నిస్ ప్రీమియర్ లీగ్ గ్రాస్‌రూట్ లీగ్‌గా టీపీఎల్ ప్లస్ జరిగింది. దీనిద్వారా యువ టెన్నిస్ అథ్లెట్లు అంతర్జాతీయ, భారతీయ స్టార్ల నుంచి నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ఈ అవార్డును ముంబై లియాన్ ఆర్మీ విజయం గెలుచుకుంది. చదవండి: FIFA WC 2022: సెమీస్ వరకు ప్రయాణం ఇలా! 32 జట్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే! Cristiano Ronaldo: కోచ్ కాదు.. నోటి మాటలే శాపంగా మారాయా? -
జెర్సీని ఆవిష్కరించిన రకుల్ ప్రీత్
-
పంజాబ్ బుల్స్ జట్టులో ప్రాంజల
ముంబై: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 12 నుంచి 15 వరకు జరుగనున్న ఈ టోర్నీ కోసం బుధవారం ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించారు. ఈ లీగ్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పంజాబ్ బుల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. వేలంలో బుల్స్ యాజ మాన్యం రూ. 1.5 లక్షలు చెల్లించి ప్రాంజలను సొంతం చేసుకుంది. ప్రాంజలతో పాటు అంకిత రైనా (ఢిల్లీ బన్నీస్ బ్రిగేడ్), మహక్ జైన్ (గుజరాత్ పాంథర్స్), రుతుజా (పుణే వారియర్స్) కూడా వేలంలో రూ 1.5 లక్షలు పలికారు. పురుషుల విభాగంలో ఫెనెస్టా ఓపెన్ చాంపియన్ నిక్కీ పునాచని, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ సహ యజమానిగా ఉన్న ముంబై లియోన్ జట్టు రూ. 2.25 లక్షలకు సొంతం చేసుకుంది. నిక్కీతో పాటు సాకేత్ మైనేని (ఢిల్లీ బిన్నీస్ బ్రిగేడ్), సోమ్‌దేవ్ (గుజరాత్ పాంథర్స్), విష్ణువర్ధన్ (బెంగళూరు హ్యాక్స్), జీవన్ నెడున్‌జెళియాన్ (పంజాబ్ బుల్స్), పురవ్ రాజా (పుణే వారియర్స్)రూ. 2.25 లక్షలు సొంతం చేసుకున్నారు. ఫెనెస్టా ఓపెన్ రన్నరప్ ఆర్యన్ (ముంబై లియోన్) రూ. 1.25 లక్షలు అందుకున్నాడు. మొత్తం 8 జట్లు టీపీఎల్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ప్రతీ జట్టులో 8 మంది చొప్పున ఆటగాళ్లుంటారు. -
ఫేస్ ఆఫ్!
నిన్నమొన్నటి దాకా ఎడమొహం పెడమొహంగా ఉన్న షారూఖ్,సల్మాన్‌ఖాన్‌లు మళ్లీ ఒక్కటై ఎంజాయ్ చేస్తుంటే... ఈ మధ్య వరకు మంచి మిత్రులైన దీపికాపడుకొనే, అనుష్కాశర్మలు ఎవరికి వారుగా తిరుగుతున్నారు. షారూఖ్‌ఖాన్ బర్త్‌డే పార్టీకి అటెండైన ఈ భామలు... పలకరించుకోలేదట. ఢిల్లీలో జరిగిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో ఎదురు పడినా కనీసం విష్ కూడా చేసుకోలేదట. విషయమేమంటే.. ఒకప్పటి అనుష్కా బాయ్‌ఫ్రెండ్ రణవీర్‌సింగ్‌తో ఇప్పుడు దీపిక డేటింగ్ చేస్తోందట. అందుకే అనుష్కకు మండుతోందని ఓ వెబ్సైట్ కథనం. అలాగే దీపిక ఒకప్పటి డేటింగ్ ఫ్రెండ్ రణబీర్‌కపూర్‌కు కత్రినా వలేసింది. కత్రినతో జతకట్టిన అనుష్కా... దీపికపై కారాలు మిరియాలు నూరుతోందట.