రాయదుర్గంలో భూముల వేలానికి రికార్డు ధర | Rs 264 Crore Per Acre Land Deal Near Raidurg Shatters Records | Sakshi
Sakshi News home page

రాయదుర్గంలో భూముల వేలానికి రికార్డు ధర

Aug 21 2026 6:09 PM | Updated on Aug 21 2026 6:25 PM

Rs 264 Crore Per Acre Land Deal Near Raidurg Shatters Records

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో భూముల ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహిస్తున్న భూముల వేలం పాటల్లో భూమికి రికార్డు ధర పలికింది. రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడైంది. రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నెంబర్ 83 /1 లో 5.25 ఎకరాల భూమిని టీజీఐఐసీ వేలం వేసింది. గతంలో ఇదే ప్రాంతంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది.

కనీస ధర 175కోట్ల రూపాయలుగా టీజీఐఐసీ నిర్ధారించింది. 10 కోట్ల రూపాయల డిపాజిట్‌గా అధికారులు నిర్ణయించారు. 10కోట్ల రూపాయలు డిపాజిట్ చెల్లించి ఆన్ లైన్ వేలంలో పాల్గొన్న బిడ్డర్లు.. ఖరీదైన భూమి కావడంతో పోటీపడి స్థిరాస్తి సంస్థలు బిడ్డింగ్ దాఖలు చేశాయి. 3 నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఎకరా భూమి 237కోట్ల రూపాయలు పలికింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement