
బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (డిసెంబర్ 3) జరిగే నామమాత్రపు ఐదో టీ20లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా ఇదివరకే కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
నాలుగో టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అక్షర్ పటేల్, అదే మ్యాచ్‌లో వికెట్ లేకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ముకేశ్ కుమార్‌లకు టీమిండియా మేనేజ్‌మెంట్ విశ్రాంతి కల్పించనుందని తెలుస్తుంది. వీరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే తుది జట్టులోకి రానున్నారని సమాచారం. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేయనుందని తెలుస్తుంది. క్రిస్ గ్రీన్ స్థానంలో కేన్ రిచర్డ్‌సన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
టీమిండియా (అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్
ఆస్ట్రేలియా (అంచనా): ట్రవిస్ హెడ్, జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), బెన్ డ్వారిషుయిస్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, కేన్ రిచర్డ్‌సన్, తన్వీర్ సంఘా