Taipei Open 2023: Parupalli Kashyap Out, Hs Prannoy In Quarter Finals - Sakshi
Sakshi News home page

Taipei Open 2023: పారుపల్లి కశ్యప్‌ అవుట్‌.. క్వార్టర్స్‌లో ప్రణయ్‌

Jun 23 2023 12:34 PM | Updated on Jun 23 2023 12:44 PM

Taipei Open 2023: Parupalli Kashyap Out Hs Prannoy in Quarters - Sakshi

Taipei Open 2023- తైపీ: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత నంబర్‌వన్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తైపీ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్‌ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌ కథ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది.

కశ్యప్‌ 16–21, 17–21తో సు లి యాంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) ద్వయం 13–21, 18–21తో చియు సియా సియె–లిన్‌ జియావో మిన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తాన్యా హేమంత్‌ (భారత్‌) 11–21, 6–21తో తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.   

పోరాడి ఓడిన శ్రీజ 
న్యూఢిల్లీ: వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ కంటెండర్‌ టోర్నీలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ, దియా చిటాలె తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... అహిక ముఖర్జీ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో శ్రీజ 6–11, 11–4, 5–11, 11–2, 7–11తో హువాంగ్‌ యిహువా (చైనీస్‌ తైపీ) చేతిలో, దియా 11–9, 7–11, 2–11, 1–11తో మియు కిహారా (జపాన్‌) చేతిలో ఓడిపోయారు. అహిక 11–8, 11–3, 11–2తో జియోటాంగ్‌ వాంగ్‌ (చైనా)పై నెగ్గింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సత్యన్‌–మనిక బత్రా (భారత్‌) ద్వయం 11–3, 11–3, 11–6తో అబ్దుల్‌ బాసిత్‌ చైచి–మలీసా నస్రి (అల్జీరియా) జంటను ఓడించిం 

Advertisement
 
Advertisement
Advertisement