రోహిత్ శర్మ విధ్వంసం.. జస్ట్ సెంచరీ మిస్‌! వీడియో వైర‌ల్‌ | Rohit Sharma missed out on a century by just 8 runs in the match against Australia. Check out his batting highlights. |Sakshi
Sakshi News home page

#Rohit Sharama: రోహిత్ శర్మ విధ్వంసం.. జస్ట్ సెంచరీ మిస్‌! వీడియో వైర‌ల్‌

Jun 24 2024 9:40 PM | Updated on Jun 25 2024 8:48 AM

T20 WC 2024 IND vs AUS: Rohit Sharma slams quickfire 92 vs Australia

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా సెయింట్ లూసియా వేదిక‌గా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు.  ఈ సూపర్‌-8 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా హిట్‌మ్యాన్ చెలరేగాడు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.  డారెన్ సామీ క్రికెట్ స్టేడియం రోహిత్ సిక్స‌ర్ల వ‌ర్షంతో తడిసి ముద్ద అయింది. సరిగ్గా 17 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రోహిత్ తృటిలో తన ఆరో టీ20 సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 

రోహిత్ సెంచరీ చేయకపోయినప్పటకి తన బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను మాత్రం ఖుషీ చేశాడు. వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఫైన‌ల్లో ఓడించార‌న్న క‌సిని ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ చూపించేశాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో 92 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. 

రోహిత్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. శెభాష్ హిట్‌మ్యాన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement