బాబోయ్‌... పాములు! | Snake threat to German football team | Sakshi
Sakshi News home page

బాబోయ్‌... పాములు!

Jun 19 2026 3:22 AM | Updated on Jun 19 2026 3:22 AM

Snake threat to German football team

జర్మనీ ఫుట్‌బాల్‌ జట్టుకు పాముల బెడద  

న్యూయార్క్‌: ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో పాల్గొంటున్న జర్మనీ జట్టుకు వింత సమస్య వెంటాడుతోంది. ఆ జట్టు బస చేసిన నార్త్‌ కరోలినా క్యాంప్‌లో పాముల బెడద ఎక్కువగా ఉందని జట్టు సభ్యులు వాపోతున్నారు. తదుపరి మ్యాచ్‌లో ఎవరితో తలపడాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనే ఆలోచనలతో పాటు పాముల నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాన్ని కూడా ఆలోచించాల్సి వస్తోందని జర్మనీ కెప్టెన్‌ జోషువా కిమ్మిచ్‌ వెల్లడించాడు. 

‘జర్మనీలో అయితే వ్యూహాలు, గాయాలు, ప్రత్యర్థుల గురించి ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఇక్కడ గడ్డిలో ఏం ఉన్నాయో అని భయపడాల్సి వస్తోంది. మా జట్టు సభ్యులకు పలు చోట్ల పాములు దర్శనమిస్తున్నాయి. వాటితో ప్రాణహాని లేకపోయినా... పాముకాటుకు గురవ్వాలని ఎవరూ కోరుకోరు కదా’ అని కిమ్మిచ్‌ పేర్కొన్నాడు. మరోవైపు స్విట్జర్లాండ్, నార్వే జట్లు కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement