breaking news
German football team
-
బాబోయ్... పాములు!
న్యూయార్క్: ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో పాల్గొంటున్న జర్మనీ జట్టుకు వింత సమస్య వెంటాడుతోంది. ఆ జట్టు బస చేసిన నార్త్ కరోలినా క్యాంప్‌లో పాముల బెడద ఎక్కువగా ఉందని జట్టు సభ్యులు వాపోతున్నారు. తదుపరి మ్యాచ్‌లో ఎవరితో తలపడాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనే ఆలోచనలతో పాటు పాముల నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాన్ని కూడా ఆలోచించాల్సి వస్తోందని జర్మనీ కెప్టెన్ జోషువా కిమ్మిచ్ వెల్లడించాడు. ‘జర్మనీలో అయితే వ్యూహాలు, గాయాలు, ప్రత్యర్థుల గురించి ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఇక్కడ గడ్డిలో ఏం ఉన్నాయో అని భయపడాల్సి వస్తోంది. మా జట్టు సభ్యులకు పలు చోట్ల పాములు దర్శనమిస్తున్నాయి. వాటితో ప్రాణహాని లేకపోయినా... పాముకాటుకు గురవ్వాలని ఎవరూ కోరుకోరు కదా’ అని కిమ్మిచ్ పేర్కొన్నాడు. మరోవైపు స్విట్జర్లాండ్, నార్వే జట్లు కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నాయి. -
స్పెషల్ బెంజ్ కార్లొచ్చాయ్
ఫ్రాన్స్ లో జరగబోయే 2016 యూఈఎఫ్ఏ యూరో చాంపియన్ షిప్ సందర్భంగా జపాన్ కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ స్పెషల్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రముఖ ఏ-క్లాస్,జీఎల్ఏ, సీఎల్ఏ మోడల్స్ స్పెషల్ వేరియంట్లను జపాన్ ఫుట్ బాల్ టీమ్ సపోర్టుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కేవలం పరిమితి సంఖ్యలోనే ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్స్ ను 2016 జూలై 10వరకు మెర్సిడెస్ విక్రయించనుంది. ఏ-క్లాస్ కు చెందిన స్మాల్ కార్లు ఏ180 లాంటివి ప్రారంభ ధర రూ.25.95లక్షల గా ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఏ200డీ ధర రూ.26.95లక్షలకు పెరుగుతుందని తెలిపింది. అలాగే సీఎల్ఏ క్లాస్ సెడాన్స్ లో కొత్త సీఎల్ఏ 200ను రూ.33.4లక్షలకు, సీఎల్ఏ200డీను 34.25లక్షలకు అందుబాటులో ఉంచుతున్నట్టు మెర్సిడెస్ ప్రకటించింది. ఏ-క్లాస్, సీఎల్ఏ, జీఎల్ఏ ప్రత్యేక ఎడిషన్ కార్లు యూఈఎఫ్ఏ యూరో 2016 ను ఇండియాలో కూడా జరుపుకుంటాయని, ఈ కొత్త తరం కార్లను డైనమిజమ్, స్పోర్టినెస్ తో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రోనాల్డ్ ఫోల్గర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే నేషనల్ రాజధాని ప్రాంతాల్లో ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్ కార్లపై నిషేధం విధించడంతో, ఈ జర్మన్ కార్ల తయారీదారి భారత్ లో కఠిన పరిస్థితులనే ఎదుర్కొంటోంది.


