హర్మన్‌తో విభేదాలు!.. స్పందించిన స్మృతి మంధాన | Smriti Mandhana breaks silence on Harmanpreet Kaur rift rumours | Sakshi
Sakshi News home page

హర్మన్‌తో విభేదాలు!.. స్పందించిన స్మృతి మంధాన

Oct 7 2026 4:29 PM | Updated on Oct 7 2026 4:58 PM

Smriti Mandhana breaks silence on Harmanpreet Kaur rift rumours

హర్మన్‌- స్మృతి (PC: BCCI Women X)

భారత మహిళల క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌ వచ్చింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన వన్డే, టీ20 జట్ల సారథిగా అధికారికంగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. జింబాబ్వేతో జరిగే సిరీస్‌ ద్వారా పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్మృతి తన ప్రయాణం మొదలుపెట్టనుంది.

ఆఫర్‌ తిరస్కరించి
కాగా పదేళ్లకు పైగా భారత జట్టును ముందుకు నడిపించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మంగళవారం కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం టీ20 సారథ్య బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకొని.. వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగవచ్చని బీసీసీఐ ఆమెకు ఆఫర్‌ ఇవ్వగా.. తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.

అంతేకాదు.. నాయకత్వ మార్పు గురించి చర్చ సమయంలోనూ హర్మన్‌- స్మృతి ఎడమొహం, పెడమొహంగా ఉన్నారని.. వారి మధ్య చాన్నాళ్ల నుంచే విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా స్మృతి మంధాన ఈ వదంతులపై పరోక్షంగా స్పందించింది.

ఒక అద్భుతమైన అనుభవం
ఇన్‌స్టా వేదికగా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఫొటో షేర్‌ చేస్తూ.. ‘‘చాలా ఏళ్లుగా నీతో కలిసి ఆడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. పదేళ్లు నీ నాయకత్వంలో ఆడటం ఒక అద్భుతమైన అనుభవం. ఇప్పుడు కూడా మనిద్దరం కలిసి దేశానికి మరిన్ని విజయాలు అందిద్దాము’’ అని స్మృతి స్టోరీ పెట్టింది. తద్వారా హర్మన్‌తో కలిసి ఆడటంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పింది. 

కాగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నప్పటికీ ప్లేయర్‌గా కొనసాగుతానని హర్మన్‌ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. స్మృతి కెప్టెన్సీలో జింబాబ్వే పర్యటనకు వెళ్లే వన్డే, టీ20 జట్లలో 37 ఏళ్ల హర్మన్‌కు చోటు దక్కింది.

చదవండి:  ‘అనుకోకుండా వచ్చాడు.. అతడి కెరీర్‌ క్లోజ్‌ చేశాడు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement