
ల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. వెస్టిండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన గిల్.. 177 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
గిల్‌కు ఇది తన కెరీర్‌లో పదో టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేసిన గిల్, ఇప్పుడు విండీస్‌పై కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి సంచలన బ్యాటింగ్ ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 518 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అతడితో పాటు జైశ్వాల్(175) సూపర్ సెంచరీతో మెరిశాడు. కాగా సెంచరీతో సత్తాచాటిన గిల్ రికార్డుల మోత మోగించాడు.
గిల్ రికార్డుల పంట..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC)లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ హిస్టరీలో ఇప్పటివరకు 71 మ్యాచ్‌లు ఆడిన గిల్ 2826 పరుగులు సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(2731) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో పంత్‌ను గిల్ అధిగమించాడు.
కెప్టెన్‌గా అత్యంత వేగంగా 5 టెస్ట్ సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌గా శుబ్‌మన్ నిలిచాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. బ్రాడ్‌మన్ ఈ ఫీట్ సాధించడానికి 13 ఇన్నింగ్స్‌లు అవసరమవ్వగా.. గిల్ కేవలం కేవలం 12 ఇన్నింగ్స్‌లలోనే నమోదు చేశాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో అలిస్టర్ కుక్(9), గవాస్కర్(10) తొలి రెండు స్దానాల్లో ఉన్నాడు.
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్‌గా గిల్.. విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. కోహ్లి 2017, 2018లో చెరో ఐదు సెంచరీలు చొప్పున చేశాడు. ఇప్పుడు ఈ ఏడాదిలో గిల్‌కు ఇది ఐదో టెస్టు సెంచరీ. 2025లో గిల్ మరో సెంచరీ సాధిస్తే కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
చదవండి: IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్..