
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా (Teamindia) కు ఊహించని షాక్ తగిలింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్(Sai Sudharsan)కు గాయపడ్డాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సుదర్శన్ చేతి వేలికి బంతి బలంగా తాకింది.
7 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రెండో బంతిని జాన్ క్యాంప్‌బెల్‌కు ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా సంధించాడు. ఆ బంతిని క్యాంప్‌బెల్ స్లాగ్ స్వీప్ ఆడాడు. షాట్ కనక్ట్ అయినప్పటికి బంతి షార్ట్ లెగ్‌లో ఉన్న సుదర్శన్ చేతిలోకి వెళ్లింది. బంతి చేతికి బలంగా తాకినప్పటికి సుదర్శన్ మాత్రం అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
ఆ క్యాచ్ చూసి బ్యాటర్‌తో పాటు మైదానంలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. అయితే బంతిని అందుకునే క్రమంలో అతడి చిటికెన వేలుకు గాయమైంది. దీంతో నొప్పితో అతడు విల్లవిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడు నొప్పి తగలేదు.

ఆఖరికి ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. అతడి గాయం తీవ్రత తెలియాల్సి ఉంది. సుదర్శన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
టీమిండియా భారీ స్కోర్..
ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. రెండో రోజు ఆటలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(175), శుబ్‌మన్ గిల్(129 నాటౌట్) అద్బుత సెంచరీలతో చెలరేగారు. సుదర్శన్(87, జురెల్ (44) ఔట్, నితీష్(43), రాహుల్(38) రాణించారు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. రోస్టన్ ఛేజ్ మరో వికెట్ పడగొట్టాడు.
చదవండి: శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్
What a grab by Sai Sudharsan! Unbelievable 🤯
Sunil Gavaskar in the commentary background: 'He caught it, he caught iitttt!pic.twitter.com/7cVpUn48mo— GillTheWill (@GillTheWill77) October 11, 2025