
సర్ఫరాజ్ ఖాన్.. భారత దేశవాళీ క్రికెట్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారించి భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్.. తన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
అయితే ఆ సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో ముంబైకర్ విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపికైనప్పటికి ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి ఆడే అవకాశం లభించలేదు. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు సర్ఫరాజ్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
అంతకంటే ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన సిరీస్‌లో భారత-ఎ జట్టు తరపున సత్తాచాటాడు. మళ్లీ ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్ ఉవ్విళ్లూరుతున్నాడు.
ఈ క్రమంలో ముంబైలో జరుగుతున్న కంగా క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిడ్‌డే రిపోర్ట్ ప్రకారం.. ఈ లీగ్‌లో పార్కోఫియర్ క్రికెటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
తాజాగా ఇస్లాం జింఖానాతో జరిగిన డివిజన్ -ఎ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌తన బ్యాట్‌ను ఝూళిపించాడు. ఈ భారత క్రికెటర్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 43 బంతుల్లో 61 పరుగులు చేశాడు. కాగా డాక్టర్ హెచ్.డి. కాంగ్రా క్రికెట్ లీగ్ ముంబైలో ప్రతీ ఏడాది ఆగస్టులో జరుగుతోంది. ఈ లీగ్‌లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆడారు.
చదవండి: 'అతడొక టాలెంటెడ్ ప్లేయర్.. చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నాడు'