సంజూ, తిలక్‌ వర్మ మెరుపులు.. టీమిండియా భారీ స్కోరు | Samson-Tilak Varma-Team-India Set 250-Runs Target-Vs WI 2nd T20 | Sakshi
Sakshi News home page

IND Vs WI: సంజూ, తిలక్‌ వర్మ మెరుపులు.. టీమిండియా భారీ స్కోరు

Oct 9 2026 8:53 PM | Updated on Oct 9 2026 8:59 PM

Samson-Tilak Varma-Team-India Set 250-Runs Target-Vs WI 2nd T20

Photo Credit: BCCI Twitter

రాంచీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు చేసింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఓపెనర్ సంజూ శాంసన్ (41 బంతుల్లో 82, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్‌తో అలరించగా, ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 43, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దనాధన్ ఆటతీరును ప్రదర్శించాడు. 

చివర్లో శ్రేయస్ అయ్యర్ (17 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) గత మ్యాచ్ ఫామ్‌ను కంటిన్యూ చేయగా, తిలక్ వర్మ (18 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా, షమర్ స్ప్రింగర్ రెండు వికెట్లు తీశాడు. అభిషేక్‌ (12 బంతుల్లో 20) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. ఇషాన్‌, సంజూ శాంసన్‌లు ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. 

ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించారు. ఇషాన్‌, శాంసన్‌, శివమ్‌ దూబేలు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరినప్పటికీ, ఆఖర్లో శ్రేయస్‌, తిలక్‌ ధాటిగా ఆడారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 32 బంతుల్లోనే 83 పరుగులు జోడించడం విశేషం. భారత ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి.

అంతకముందు టాస్ గెలిచిన వెస్టిండీస్‌ బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో మంచు కురిసే అవకాశం ఉండడంతో బౌలింగ్‌ ఎంచుకున్నట్లు హోప్‌ తెలిపాడు. తొలి టీ20 ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు వెస్టిండీస్‌ మాత్రం తుదిజట్టులో ఒక మార్పు చేసింది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement