టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడు. బీసీసీఐ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్టేడియం వేదికగా రెండో అనాధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా-ఎ, భారత్-ఎ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టు సారథ్యం వహిస్తున్న పంత్ చేతి వేలికి గాయమైంది.
రెండో రోజు ఆట ఆరంభంలో గ్రీన్ టాప్ పిచ్‌పై సఫారీ పేసర్లు నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన షెపో మోరెకి వేసిన ఓ రాకాసి బౌన్సర్ పంత్ చేతి వేలికి బలంగా తాకింది. దీంతో రిషబ్ నొప్పితో విల్లవిల్లాడు.
వెంటనే ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి చికిత్స అందించాడు. నొప్పిని భరిస్తూనే పంత్ తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత బంతికే పంత్ ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న క్రమంలో పంత్ కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. అయితే మూడో రోజు ఆటలో పంత్ ఫీల్డింగ్ వస్తాడో రాడో వేచి చూడాలి.
కాగా దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో పంత్ ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన తర్వాత పంత్‌కు భారత్ తరపున ఇదే తొలిసారి. సఫారీలతో సిరీస్‌కు ముందు పంత్ గాయపడడం భారత జట్టు మెనెజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది.
చదవండి: జిడ్డు ఆటగాడి కోసం అతడిని బలి చేస్తావా? గంభీర్ ఇది నీకు న్యాయమేనా?


