సెమీస్‌లో రష్మిక  | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో రష్మిక 

Published Sat, Oct 14 2023 12:19 AM

Rashmika in the semis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ క్రీడాకారిణి శ్రీవల్లి రషి్మక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రషి్మక 6–2, 6–3తో వలెరి జినీనా (రష్యా)పై గెలిచింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించింది.

మరోవైపు న్యూఢిల్లీలో జరుగుతున్న ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ చాంపియన్‌íÙప్‌లో అండర్‌–14 బాలుర డబుల్స్‌ విభాగంలో హృతిక్‌ కటకం (తెలంగాణ)–తవీష్‌ (హరియాణా) జోడీ టైటిల్‌ సొంతం చేసుకుంది. ఫైనల్లో హృతిక్‌–తవీష్‌ ద్వయం 6–4, 7–5తో శౌర్య–రణ్‌వీర్‌ జంటపై నెగ్గింది. సింగిల్స్‌లో హృతిక్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో హృతిక్‌ 6–4, 6–1తో అనురాగ్‌పై గెలిచాడు.   

Advertisement
 
Advertisement
 
Advertisement