సింధు ఏడో‘సారీ’... | PV Sindhu retreated in the pre quarter final | Sakshi
Sakshi News home page

సింధు ఏడో‘సారీ’...

Mar 15 2024 2:36 AM | Updated on Mar 15 2024 2:36 AM

PV Sindhu retreated in the pre quarter final - Sakshi

ఆన్‌ సె యంగ్‌ చేతిలో మళ్లీ ఓటమి

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో భారత కథ ముగిసింది. భారత స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగింది. గత ఐదేళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన దక్షిణ కొరియా ప్లేయర్‌ ఆన్‌ సె యంగ్‌ చేతిలో సింధు వరుసగా ఏడోసారి ఓడిపోయింది.

గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ సింధు 19–21, 11–21తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆన్‌ సె యంగ్‌ చేతిలో ఓటమి పాలైంది. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఆన్‌ సె యంగ్‌కు గట్టిపోటీనిచ్చిన సింధు రెండో గేమ్‌లో మాత్రం తడబడింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిన సింధుకు 3,900 డాలర్ల (రూ. 3 లక్షల 23 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4800 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement