source: X
బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ ఎలైట్ 2026-27 సీజన్ కోసం హైదరాబాద్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ప్రణవి చంద్ర వెలగపూడి వ్యవహరించనుండగా.. వికెట్ కీపర్ ఎం.మమత వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఈ టోర్నీ అక్టోబర్ 26 నుంచి మహారాష్ట్రలోని పుణేలో జరుగనుంది.
సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టు..
ప్రణవి చంద్ర వెలగపూడి (కెప్టెన్), ఎం మమత (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, దృతి కేసరి, ఎస్ యశశ్రీ, పూజా వంక, సంధ్యా గోరా, కుంచాల నితీషా, ఎం సాక్షి రావు, కావ్య శ్రీ, ఎడ్ల సృజన, క్రాంతి రెడ్డి నల్లా, కె నిధి, ఆ పల్లయ్య కృష్ణ, పల్లకీ నిధి.
స్టాండ్ బైస్: వై త్రిష పూజిత, కట్టా శ్రీవల్లి, శ్రీ బిల్వికా రెడ్డి, ఎం శివాని గౌడ్ మరియు మేహా లక్ష్మి ఈడిగ.
ఇదీ చదవండి: న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన


