ఫైనల్లో నిఖత్‌ జరీన్‌ | Nikhat Zareen in the final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో నిఖత్‌ జరీన్‌

May 17 2024 4:26 AM | Updated on May 17 2024 4:26 AM

Nikhat Zareen in the final

ఎలోర్డా కప్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ నిఖత్‌ జరీన్‌ (52 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ 5–0తో తొమిరిస్‌ మిర్జాకుల్‌ (కజకిస్తాన్‌)పై ఘన విజయం సాధించింది. 

భారత్‌కే చెందిన మీనాక్షి (48 కేజీలు), అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో మీనాక్షి 5–0తో గుల్నాజ్‌ బురిబయేవా (కజకిస్తాన్‌)పై, మనీషా 5–0తో టాంగటార్‌ అసెమ్‌ (కజకిస్తాన్‌)పై గెలిచారు. 

మరోవైపు సోనూ (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు) సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో భారత బాక్సర్లు సొయిబమ్‌ సింగ్‌ (48 కేజీలు), అభిషేక్‌ యాదవ్‌ (67 కేజీలు), విశాల్‌ (86 కేజీలు), గౌరవ్‌ చౌహాన్‌ (ప్లస్‌ 92 కేజీలు) నేడు సెమీఫైనల్స్‌లో పోటీపడనున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement